founder founder
slide show

లలితకళా ఉత్సవం 2014

6th Dec
2014
3:13 PM

బాలకుటీర్ వ్యవస్ధపకులలో ఒకరైన స్వర్గీయ గరిగె ప్రభావతి గారికి పిల్లలపట్ల, లలితకళల పట్ల అమితమైన ప్రేమ, సంగీతమంటే ఎనలేని ప్రీతి. అందుకు ప్రతిగా - ఆమె మధురస్మృతిగా ప్రతి సంవత్సరం ఆమె వర్ధంతి డిసెంబరు 10న సంగీతోత్సవం నిర్వహించబడుతోంది.

ఈ ఉత్సవంలో భాగంగా అనేక సాహిత్య సాంస్కృతిక రంగాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించి నిష్నాతులు అయినటువంటి వారికి పురస్కారాలు అందజేయహడతాయి.

Award Winners

బాలసాహిత్య పురస్కారం

వ్యక్తిత్వ రూపకల్పనలో ఉత్తమ సాహిత్యం ప్రధాన భూమికను నిర్వహిస్తుందని డా. మంగాదేవి ప్రగాడ విశ్వాసం. ఆ విశ్వాసంతోనే బాల సాహిత్య సృష్టికర్తలను ప్రోత్సహించడం కోసం శ్రీ వేంకటేశ్వర బాలకుటీర్ వ్యవస్ధాపకురాలు డా. మంగాదేవి 1994లో బాలసాహిత్య పురస్కారాన్ని నెలకొల్పారు. ఈ పురస్కారానికి గాను రూ. 25,000/- నగదు, జ్ఞాపిక బహూకరించబడతాయి.

గ్రహీత

దశాబ్దాలుగా బాలసాహిత్య సృజనలో 32 నవలలు, వందలాది కధలు రచించి అనేక పురస్కారాలు అందుకున్న శ్రీ గీతా సుబ్బారావు గారు ఈ సంవత్సరం స్వీకరిస్తున్నారు.

గత గ్రహీతలు

  • శ్రీ మహీధర నళినీమోహన్,
  • శ్రీ ఏడిద కామేశ్వరరావు,
  • శ్రీ బుడ్డిగ సుబ్బరాయిన్,
  • శ్రీమతి à°¡à°¿. సుజాతాదేవి,
  • శ్రీ కలువకొలను సదానంద,
  • శ్రీ వెలగ వెంకటప్పయ్య,
  • శ్రీమతి మనోరమ జాఫా,
  • శ్రీమతి మంజులూరి కృష్ణకుమారి,
  • శ్రీ రావూరి భరద్వాజ.
  • శ్రీ సి.వి. సర్వేశ్వర శర్మ,
  • శ్రీ రెడ్డి రాఘవయ్య,
  • శ్రీ బుజ్జాయి ( దేవులపల్లి సుబ్బరాయి శాస్త్రి),
  • చందమామ పత్రిక శ్రీ విశ్వనాధరెడ్డి,
  • శ్రీమతి చంద్రలత,
  • శ్రీ వాడ్రేవు à°šà°¿à°¨ వీరభద్రుడు,
  • శ్రీ చొక్కాపు వెంకటరమణ,
  • శ్రీ దాసరి వెంకటరమణ,
  • సాహితీ మిథునం 'వసుంధర',
  • శ్రీ అలపర్తి వెంకట సుబ్బారావు,
  • బాలి.

మాలతీప్రమదాసాహితీ పురస్కారం

డా. మంగాదేవికి ప్రముఖ రచయిత్రి శ్రీమతి మాలతీచందూర్ తో వున్న చిరకాలపు ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా ఈ సంవత్సరం నుండి మాలతీప్రమదాసాహితీ పురస్కారాన్ని బాలకుటీర్ నెలకొల్పింది. ఈ పురస్కారానికి గాను రూ. 25,000/- నగదు, ఙ్ఞాపిక బహుకరించబడతాయి.

గ్రహీత

ఈ సంవత్సరం ఈ పురస్కారాన్ని 'రచనకు సామాజిక ప్రయోజనం ఉండాలి' అన్న ధ్యేయంతో 5 దశబ్దాలుగా 300 వరకు కధలు, 21 నవలలు, అనేక కధా, కవితా సంపుటులు వెలువరించి అనేక అంతార్జాతీయ పురస్కారాలను అందుకున్న ప్రముఖ రచయిత్రి శ్రీమతి డి. కామేశ్వరి అందుకోబోతున్నారు.

గత గ్రహీతలు

తొలి పురస్కారాన్ని 'శ్రీమతి ఓల్గా' అందుకున్నారు.

చిత్రలేఖన పురస్కారం

బాలకుటీర్ పూర్వ విద్యార్ధిని చి. కర్పూరపు దేవీ చైతన్య ఙ్ఞాపకార్ధం ప్రాణప్రదమైన చిత్రలేఖనంలో ప్రతి సంవత్సరం రాష్ర్టస్ధాయి పోటీలను నిర్వహించి విజేతలకు ఈనాటి ఉత్సవంలో పురస్కారాలు అందించబడుతున్నాయి.

ప్రతిభాపల్లవం పురస్కారం

బాలలలోని సృజనాత్మతను వికసింపజేయడం కోసం స్వర్గీయ ప్రొ. కొండేపూడి లావళ్య స్మృతిగా బాలకుటీర్ "ప్రతిభాపల్లవం" పురస్కారాన్ని నెలకొల్పింది. వివిధ లలితకళల్లో ప్రతిభాపాటవాలను కనబరుస్తున్న బాలలకు అందజేసే ఈ పురస్కారానికి గాను రూ. 5,000/- లు, ఙ్ఞాపిక అందజేయబడతాయి.

గ్రహీత

ఈ సంవత్సరపు పురస్కారాన్ని చిన్ననాటి నుండే కధారచన చేస్తూ ప్రశంసలు అందుకుంటున్న చి.యోగిశ్వరరెడ్డి స్వీకరించుచున్నాడు.

బాలల లలితకళా సంబరాలు అంబరం తాకే శుభవేళకు వివిధ ప్రాంతాల నుండి తరలివస్తున్న బాలలకు, పెద్దలకు ఇదే మా ఆహ్వనం.